గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (14:33 IST)

హోదా కోసం పవన్ పోరాటం చేయాలి.. తెరాసకే ఓటు : హీరో సుమన్

ప్రత్యేక హోదా కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేయాలని, ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల జీవనాడి అని సినీ హీరో సుమన్ వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో సుమన్ పాల్గొని మాట్లాడుతూ, భారీగా అభిమాన, అనుచరగణం ఉన్న పవన్ పోరాటం చేస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందన్నారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టాలని కోరారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తాను మద్దతు ఇస్తానని సుమన్ ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కేసీఆరే రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సుమన్ తెలిపారు.