గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (13:06 IST)

ప్రియుడితో లేచిపోయిన పెళ్లి కుమార్తె... ఎక్కడ?

మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె తాను ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది. దీంతో ఆగ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వధువు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు.

మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కుమార్తె తాను ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది. దీంతో ఆగ్రహించిన వరుడి కుటుంబ సభ్యులు వధువు ఇంటిపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి 14మందిపై కేసు పెట్టారు. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మండలంలోని పులికల్లు పంచాయతీ గొడ్డెంపల్లెకు చెందిన లచ్చన్నగారి వినోద్‌కుమార్‌ అనే యువకుడు బి.కొత్తకోటలో చదువుకుంటున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. ఒకరు డిగ్రీ మరొకరు ఎంబీఏ పూర్తి చేశారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు వివాహానికి నిరాకరించారు.
 
ఈ నేపథ్యంలో ఆ యువతికి మరో అబ్బాయితో ఈనెల 10వ తేదీన పెళ్లి చేయడానికి పెద్దలు నిశ్చయించారు. పెళ్లి పత్రికలు కూడా పంపిణీ చేశారు. ఇంతలో గురువారం రాత్రి వధువు తన ప్రియుడితో కలిసి లేచిపోయింది. దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబీకులు వినోద్‌కుమార్‌ ఇంటిపై దాడి ఇంటిలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేశారు.