శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (14:09 IST)

రూ. 1కే కిలో టమోటాలు, రాయలసీమలో ఆవులు తింటున్నాయి

tomatto
నిన్నటి వరకు రూ.200 నుంచి రూ.300 మేరకు ధర పలికిన టమోటాలు ఇపుడు ఒక్క రూపాయికి కూడా కొనేందుకు కూడా వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. తాము పండించిన పంటకు కనీసం ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాపిలి మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ.3కే పలుకుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క రూపాయికి కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. టమోటా ధరలు లేక రైతులు రోడ్ల మీద పారబోస్తున్నారు. 
 
నంద్యాల జిల్లా ప్యాపిలి టమోటా మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు టమోటాను అక్కడే పారబోసి వెళ్లిపోయారు. వాటిని పశువులు మేశారు. ధర బాగా తగ్గడంలో కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో దాదాపు అన్ని మార్కెట్‌లలో ఇదే పరిస్థితి నెలకొనివుంది. కిలో టమోటా ప్యాపిలిలో రూ.3 పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో కనీసం రూ.1కి కూడా ఎవరూ కొనేందుకు ముందుకు రావడం లేదు. మదనపల్లి మార్కెట్‌లోనూ ధరలు పడిపోయాయి.