గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (06:28 IST)

శ్మశానంతో పోల్చి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు..?

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ప్రభుత్వం మభ్య పెడుతోందని టీడీపీ నేత బొండా ఉమా మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ బ్రాండ్స్ మద్యంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పేరిట మభ్య పెడుతోందని బొండా ఉమ ఆరోపించారు. ప్రతి జిల్లాలో నిర్మాణం పూర్తైన ఇళ్లు ఉన్నాయన్న ఆయన... గతంలో చంద్రబాబు 2 పడకల ఇళ్లు కట్టించారన్నారు.

టీడీపీ హయాంలో 5 లక్షల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలాలు ఇచ్చామని గుర్తుచేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చారు.

మరి అక్కడ పేదలకు ఎందుకు స్థలాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుందన్నారు.