మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 అక్టోబరు 2024 (11:11 IST)

ఏపీలో జోరుగా మద్యం వ్యాపారం... 3 రోజుల్లో రూ.77 కోట్ల విక్రయాలు

liquor
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా మద్యం వ్యాపారం సాగుతుంది. దీనికి నిదర్శనమే గత మూడు రోజుల్లో ఏకంగా రూ.77 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఆ రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలతో పాటు ప్రైవేటు మద్యం దుకాణాలు కూడా తెరుచుకున్నాయి. వీటిలో అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. 
 
గత మూడు రోజుల్లో రూ.541 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ మూడు రోజుల్లోనే 7943 మంది వ్యాపారులు స్టాక్ తీసుకెళ్లారు. ఈ మూడు రోజుల్లోనే రెండు, మూడు సార్లు స్టాక్ తీసుకెళ్లిన వ్యాపారులు కూడా ఉన్నారంటా రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. 
 
నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 677511 కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది. 194261 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. రాష్ట్రంలోని బార్లకు ఈ మూడు రోజుల్లో ఎక్సైజ్ శాఖ రూ.77 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది.