మతం మార్చుకుంటేనే కోడలితో కాపురమన్న తల్లి.. సరేనంటూ తలూపిన కొడుకు... ఎక్కడ?

శనివారం, 12 ఆగస్టు 2017 (11:16 IST)

sadist

ప్రేమ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలికి అత్త వైపు నుంచి వేధింపులు మొదలయ్యాయి. కోడలు మతం మార్చుకుంటేనే కాపురం చేయమని కొడుక్కి షరతు విధించింది. తల్లిమాట జవదాటని కొడుకు... భార్యను వేధించసాగాడు. పైగా, మతం మార్చుకోవాల్సిందేనని, అప్పటివరకు కాపురం చేసే ప్రసక్తే లేదని చెపుతూ భార్యను వీధిపాలు చేశాడు. అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని బుక్కపట్నానికి చెందిన దీపకు పెనుకొండవాసి అనిల్‌కుమార్‌తో 2014లో పరిచయమైంది. పుట్టపర్తి కళాశాలలో చదువుకునే సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగామారి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనప్పటికీ ఇంటి పెద్దలను ఎదిరించి 2016లో కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు.
 
కొద్దిరోజులు హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో కాపురం ఉన్నారు. ఆ తర్వాత తల్లి, బంధువుల ఒత్తిడికి తలొగ్గిన అనిల్‌.. భార్యను వేధించసాగాడు. యేడాదిగా అత్తతో పాటు భర్త చిత్రహింసలను మౌనంగా భరిస్తూ వచ్చిన రూప... ఏరోజైనా భర్త మారి ఆదరించకపోతాడా అని ఎదురు చూసింది. ఇప్పటికే పెద్దల సమక్షంలో పంచాయితీ, పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా.. వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు ఆమెను వదిలించుకునే ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో ఆమె అత్తింటికి చేరి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత వేలిముద్ర ఇష్యూ- లక్కానీకి సమన్లు.. అపోలో వ్యవహారం బయటపడుతుందా?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్ర వ్యవహారంలో ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లక్కానీకి ...

news

యూపీలో ఘోరం.. ఆక్సిజన్ అందక 30 మంది పసికందుల మృతి.. సీఎం అత్యవసర భేటీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక 30 మంది ...

news

హైదరాబాద్ వీధుల్లో కోటీశ్వర 'బిచ్చగాడు' అజ్ఞాతవాసం! ఎందుకు?

మహాభారతంలో పంచపాండవులు జూదంలో ఓడిపోయి అజ్ఞాతవాసం గడుపుతారు. అలాగే, 'బిచ్చగాడు' చిత్రంలో ...

news

ఏపీ శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

అమరావతి : శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ...