గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జూన్ 2022 (12:20 IST)

లైంగికదాడి వీడియోలు షేర్ చేసిన రఘునందన్ రావు.. కేసు నమోదు

raghunandan rao
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార కేసులో బాధిత బాలిక ఫోటోలు, వీడియోలను షేర్ చేసినందుకు బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై అబిడ్స్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది. 
 
అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐసీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
బాలిక వీడియోలను బహిర్గతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వెబ్ రిపోర్టర్‌కు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. అఘాయిత్యానికి గురైన బాలిక లేదా మహిళ లేదా యువతి ఫోటోలు బయటకు విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, వీడియో ఎవరు తీశారు? ఎందుకు తీశారు? ఎలా బయటకు వచ్చాయనే విషయాలపై స్పష్టంత వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.