సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (10:02 IST)

నువ్వే నా సర్వస్వమని నాలుగేళ్లు సహజీవనం.. వేరొక యువతితో పెళ్లి

ప్రేమ-పెళ్లికి గల విలువ రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రేమ పేరుతో మోసం చేసేవారు అధికమవుతున్నారు. తాజాగా ప్రేమించి సహజీవనం చేసి, నాలుగేళ్లపాటు ఆమెతో గడిపిన ఓ ప్రబుద్ధుడు ఎంచక్కా వేరొక యువతిని పెళ్లాడు. ఈ ఘ

ప్రేమ-పెళ్లికి గల విలువ రోజురోజుకు తగ్గిపోతోంది. ప్రేమ పేరుతో మోసం చేసేవారు అధికమవుతున్నారు. తాజాగా ప్రేమించి సహజీవనం చేసి, నాలుగేళ్లపాటు ఆమెతో గడిపిన ఓ ప్రబుద్ధుడు ఎంచక్కా వేరొక యువతిని పెళ్లాడు. ఈ ఘటన హైదరాబాదులోని ఫిల్మ్ నగర్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రేమించానని, జీవితాంతం తోడుంటానని.. వేరొక మహిళను కన్నెత్తి కూడా చూడనని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నాలుగేళ్లు పూర్తయ్యాక వేరొక యువతిని ప్రేయసికి తెలియకుండానే పెళ్లాడాడు. ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో నివసించే యువతి(23)కి స్థానికంగా ఉండే సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నాలుగేళ్లుగా సహజీవనం చేసిన సత్యనారాయణ.. చివరికి వేరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.