శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 15 జూన్ 2019 (11:12 IST)

హైదరాబాద్‌లో దోపిడీదొంగల బీభత్సం, గృహిణి కళ్లల్లో కారం కొట్టి హత్య

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. దోపిడీ దొంగలు తాజాగా తమకు అడ్డొచ్చిన మహిళ కళ్లల్లో కారం కొట్టి గొంతు నులిమి చంపేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది. సాయివాణి కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ సురేందర్ గౌడ్ఇంటిలో దొంగలు చొరబొడ్డారు. 
 
పూజా మందిరంలో గృహిణి అరుంధతి పూజ చేసుకుంటుండగా ఏదో అలికిడి వినిపించినట్టు అనిపించింది. అటు చూసేసరికి దొంగలు ఒక్కసారిగా ఆమెపై దాడికి దిగారు. ఇంట్లోని బంగారం, డబ్బంతా ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని దొంగలు బెదిరించారు. దోపిడిని అడ్డుకునేందుకు యత్నించిన డాక్టర్ సురేందర్ గౌడ్ భార్య అరుంధతి కళ్లల్లో కారం చల్లారు దొంగలు. 
 
ఊహించని ఈ హఠాత్ పరిణామానికి తేరుకుని దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఈ ఇల్లాలు. కేకలు వేస్తుందేమోనని భయపడ్డ దొంగలు ఒక్కసారిగా అరుంధతి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న డాక్టర్ సురేందర్ గౌడ్‌కు తన విగత జీవిలా పడిఉండటాన్ని చూసి షాకయ్యాడు.