శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 24 మే 2018 (15:44 IST)

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పాలిథీన్‌పై సంపూర్ణ నిషేధం

పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందులోభాగంగా, హైదరాబాద్ నగరంలో పాలిథీన్ కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలని భావిస్తోంది.

పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందులోభాగంగా, హైదరాబాద్ నగరంలో పాలిథీన్ కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలని భావిస్తోంది. 
 
నిజానికి భాగ్యనగరంలో పాలిథీన్ కవర్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇవి పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించాయి. దీంతో ప్రజల వినియోగం నుంచి పాలిథీన్ కవర్లను తొలగించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఈనెల 23వ తేదీన జరిగిన జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో పాలథీన్ కవర్ల ఆమోదం తెలిపారు. ఈ తీర్మాన ప్రతిని ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నారు.
 
పౌరులు, దుకాణాదారులు, ఇతరులు ఎవరైనాగానీ పాలిథీన్ కవర్లను వినియోగిస్తే వారికి మెుదటిసారి రూ.25 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానా విధించాలన్నది ప్రతిపాదన. మూడోసారి కూడా ఉల్లంఘన జరిగితే ఈ ఆమోదానికి సంబంధించిన దుకాణాన్ని మూసివేయాలని భావిస్తున్నారు. 
 
పాల ఉత్పత్తులకు, మెుక్కల పెంపకానికి కవర్ల వినియోగానికి మినహాయింపు ఇవ్వనున్నారు. ఎగుమతుల కోసం కవర్లను సెజ్‌లలో యూనిట్లు తయారు చేసేందుకు అనుమతిస్తారు.