శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (10:44 IST)

హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా వున్న బాలికపై రోజూ అత్యాచారం..

హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై పదిరోజుల పాటు ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. న‌గ‌రంలోని పంజాగుట్ట పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తల్లి ఇళ్లల్లో పని చేస్తుండగా, తండ్రి పాల వ్యాపారం చేస్లుంటాడు. తల్లిదండ్రులు రోజూ ప‌ని కోసం బయటికి వెళ్తుండటంతో ఒంటరిగా ఉంటోన్న బాలిక‌ను జ‌హంగీర్ అనే యువ‌కుడు గుర్తించాడు.
 
కొద్దిరోజుల నుంచి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికపై లైంగికంగా దాడికి పాల్పడుతు వచ్చాడు. ఇంకా ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అలా రోజూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. కానీ మంగళవారం ప‌ని నుంచీ వ‌చ్చిన త‌ల్లిదండ్రులు బాలిక నీరసంగా కనిపించడంతో  ఏమైందని ప్ర‌శ్నించ‌డంతో దారుణం బ‌య‌ట‌ప‌డింది. 
 
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.