హైకోర్టులో రవి ప్రకాష్‌కు ఎదురు దెబ్బ... ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కృతి

ravi prakas
Last Updated: బుధవారం, 15 మే 2019 (14:24 IST)
మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు హైదరాబాద్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసులు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తక్షణ విచారణను కోరారు. దీన్ని స్వీకరించిన హైకోర్టు... తక్షణ విచారణకు నో చెప్పింది. అలాగే, రవి ప్రకాష్ కోసం దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది.

సంతకాల ఫోర్జరీతో పాటు... డేటా చోరీకి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో రవి ప్రకాష్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలంటూ ప్రకాశ్‌కు పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశారు. అయితే.. ఇప్పటివరకు ఆయన నోటీసులపై స్పందించలేదు.

పైగా, ఇందుకోసం పోలీసులు విధించిన గడువు కూడా బుధవారం ఉదయంతో ముగిసింది. దీంతో రవి ప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, గత మూడు నాలుగు రోజులుగా ఆయన ఎక్కడ ఉన్నదీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీంతో ఆయన ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :