శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (15:16 IST)

అత్తాపూర్ పిల్లర్ నంబర్ 139 వద్ద.. వెంటాడి.. వేటాడి నరికేశాడు.. భయంతో పారిపోయిన ఖాకీలు

హైదారాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. అదీ కూడా పట్టపగలు, నగరం నడిబొడ్డున ఈ హత్య జరిగింది. ఒకవైపు పోలీసు వాహనం ఆగివుండగా, ఆ పక్కనే పోలీసులు నిలబడివున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ఆ కిరాతకుడు ఓ వ్య

హైదారాబాద్ నగరంలో దారుణ హత్య జరిగింది. అదీ కూడా పట్టపగలు, నగరం నడిబొడ్డున ఈ హత్య జరిగింది. ఒకవైపు పోలీసు వాహనం ఆగివుండగా, ఆ పక్కనే పోలీసులు నిలబడివున్నారు. అయినా ఏమాత్రం పట్టించుకోని ఆ కిరాతకుడు ఓ వ్యక్తిని అడ్డంగా నరికేసి వెళ్లిపోయాడు. బుధవారం జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే...
 
హైదరాబాద్ నగరంలో అత్తాపూర్‌ వద్ద మెట్రో రైల్ పిల్లర్ నం‌.139 దగ్గర ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తి ఒకరు గొడ్డలితో నరికి చంపాడు. అదీకూడా దాదాపు 100 మీటర్ల దూరంవరకు వెంటాడి వేటాడి అతికిరాతకంగా హత్యచేశాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. 
 
తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినా పోలీసులు సాహసం చేయలేదు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండటంతో భయపడుతూ వెనక్కి తగ్గారు. దాడి తర్వాత పారిపోతున్న ఇద్దరు నిందితులను ట్రాఫిక్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు, ఎందుకు హత్య చేశారన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.