మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:55 IST)

భార్యతో గడిపిన దృశ్యాలు లైవ్‌.. డబ్బు కోసం మగ వ్యభిచారిగా మారిన టెక్కీ

డబ్బు కోసం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మగ వ్యభిచారిగా మారిపోయాడు. ఇందుకోసం తన భార్యతో గడిపిన పడక గది దృశ్యాలను లైవ్ చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... హైద్రాబాద్‌లోని చింతల్‌ ప్రాంతంలో ఓ దంపతుల జంట నివశిస్తో

డబ్బు కోసం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మగ వ్యభిచారిగా మారిపోయాడు. ఇందుకోసం తన భార్యతో గడిపిన పడక గది దృశ్యాలను లైవ్ చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... హైద్రాబాద్‌లోని చింతల్‌ ప్రాంతంలో ఓ దంపతుల జంట నివశిస్తోంది. వీరిద్దరు ఉద్యోగులే. నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. పైగా భర్తకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని భావించారు. 
 
కానీ, అతనికి అశ్లీల వెబ్‌సైట్స్ చూసే అలవాటుంది. బానిసగా మారిపోయాడు. భార్యను కూడా బలవంతం చేసి అభ్యంతరకరంగా చేయాలంటూ ఇబ్బంది పెట్టేవాడు. పోర్న్‌సైట్స్ చూస్తున్న సమయంలో అతనికో దురాలోచన వచ్చింది. ఈ వెబ్‌సైట్స్‌లో తమ పడక గది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో పెడితే డబ్బు సంపాదించుకోవచ్చని భావించాడు.
 
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఈ విషయాన్ని భార్యకు తెలియకుండా ప్లాన్ చేశాడు. పడక గదిలోవుండగా ల్యాప్ టాప్‌లో ఏదో ఒక సినిమా పెట్టేవాడు. ఆ ముసుగులో వెబ్‌క్యామ్ కూడా ఆన్ చేసేవాడు. సినిమా వస్తుంది కదా అన్న భావనలో భార్య ఉండేది. ఆ వెబ్‌క్యామ్‌ను ఓ లైవ్ స్ట్రీమ్ పోర్న్ సైట్‌కు అనుసంధానం చేసేవాడు. పోర్న్ సైట్స్‌లో కేవలం భార్య ముఖమే కనిపించేలా వెబ్ కెమెరాను సెట్ చేశాడు. ఈ వీడియోల ద్వారా వచ్చిన డబ్బును సొమ్ము చేసుకునే వాడు. 
 
ఈ వ్యవహారమంతా ఆ లైవ్ స్ట్రీమ్ సభ్యుడైన కేరళ వాసి ద్వారా బయటికొచ్చింది. ఆ వీడియోను అతను వేరే అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియో బాధితురాలి సన్నిహితుల కంటపడింది. ఈ విషయాన్ని ఆమెకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా ఆ శాడిస్ట్ భర్తను ప్రశ్నించగా నిజాలు నిగ్గుతేలాయి. అతను చేసిన పనికి దర్యాప్తు అధికారులే విస్తుపోయారు. ఇంకా డబ్బు సంపాదించాలనే యావతో మగ వ్యభిచారిగా కూడా మారి, తన పేరును, ఫోన్ నెంబర్‌ను మేల్ ఎస్కార్ట్ సైట్స్‌లో నమోదు చేసినట్టు వెల్లడించాడు.