మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 17 జనవరి 2022 (22:13 IST)

నాకు భార్యాబిడ్డలున్నారు.. నన్ను చంపేయడం ఖాయం... ఎవరు?

నాకు ప్రాణ హాని ఉంది. నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను. అందరిలాగా నాకు ఖాళీగా కూర్చోవడం తెలియదు. అక్రమ మైనింగ్ పైన ఉక్కుపాదం మోపాను. కోట్ల రూపాయలు ఫైన్లు వేశాను. ప్రభుత్వానికి ఎంతో ఆదాయానికి తీసుకొచ్చాను. దీంతో నాపై కొంతమంది కక్ష గట్టారు.

 
నన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాకు గన్‌మెన్లు ఇచ్చారు. వారు 24 గంటలూ నాతో ఉండరు కదా. నాకు బతుకుతానన్న నమ్మకం పోతోంది. నాకు భార్యాబిడ్డలు ఉన్నారు. నేను ఎవరికి చెప్పుకోవాలి. నా ఉన్నతాధికారులకు చెప్పాను.

 
వారు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు. అందరూ నారాయణ నారాయణ అంటే నేను కూడా నారాయణ అనేస్తే సరిపోయేదేమో.. నేను గోవిందా అన్నాను.. అందుకే నన్నుఇలా చేస్తున్నారనుకుంటున్నానంటూ సాక్షాత్తు గనుల శాఖ విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

 
ఏ క్షణమైనా తనకు ముప్పు ఉందంటున్నాడు. తనతో పాటు పనిచేసే వారే కొంతమందికి ఉప్పందిస్తున్నారని.. అదే తన ప్రాణభయానికి కారణమంటున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రాధేయపడుతున్నాడు.