1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 20 ఆగస్టు 2016 (18:37 IST)

సింధుకు 2 ఎక‌రాలు జ‌గ‌న్ చేతుల మీదుగా ఇస్తా : విజ‌య్ చంద‌ర్

విజ‌య‌వాడ ‌: సింధు తెలుగు జాతికి పేరు తెచ్చింద‌ని, ప్రతి ఒక్కరు తమ ఇంట్లో సింధు లాంటి అమ్మాయి ఉండాలనుకుంటున్నార‌ని న‌టుడు, వైసీపీ నాయ‌కుడు విజ‌య్ చంద‌ర్ అన్నారు. ఒలంపిక్ క్రీడల్లో స‌త్తా చాటిన పీవీ సింధుకు 2 ఎకరాల భూమిని వ్యక్తిగత హోదాలో తాను ప్రకటిస

విజ‌య‌వాడ ‌: సింధు తెలుగు జాతికి పేరు తెచ్చింద‌ని, ప్రతి ఒక్కరు తమ ఇంట్లో సింధు లాంటి అమ్మాయి ఉండాలనుకుంటున్నార‌ని న‌టుడు, వైసీపీ నాయ‌కుడు విజ‌య్ చంద‌ర్ అన్నారు. ఒలంపిక్ క్రీడల్లో స‌త్తా చాటిన పీవీ సింధుకు 2 ఎకరాల భూమిని వ్యక్తిగత హోదాలో తాను ప్రకటిస్తున్నాన‌ని తెలిపారు. 
 
వైయస్ జగన్ చేతుల మీదుగా ఆ రెండు ఎకరాల స్థలాన్ని ఇవ్వనున్నట్లు విజయ్ చందర్ తెలిపారు. కేసీఆర్ ఫాంహౌస్ ఎర్రవల్లికి సమీపంలో ఖరీదైన భూమిని సింధుకి బహుమతిగా విజయ్ చందర్ ప్ర‌క‌టించ‌డం విశేషం.