గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (09:42 IST)

జగన్ కోసం మానవబాంబుగా మారిపోతా : టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్

duvvada srinivas
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం తాను మానవ బాంబుగా మారిపోతానని టెక్కలి వైకాపా అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తానని చెప్పారు. అలాగే, వైకాపా కార్యకర్తలంతా జగన్‌కు రక్షణ కవచంలా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తాము తలచుకుంటే చంద్రబాబు నాయుడు రోడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. జగన్ సూచనతోనే తాము సంయమనం పాటిస్తున్నామని తెలిపారు. 
 
జగన్‌పై విసిరిన రాయి నుదిటిపై తగిలింది కాబట్టి సరిపోయిందని, అదే కొంచెం ఎడమ వైపో, కుడివైపో తలిగివుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్‌పై ఆధారపడిన కోట్లాడిమంది ప్రజల జీవితాలు ఏమయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జగన్‌నము రక్షించుకునేందుకు తానే కాదని, తనలాంటి లక్షలాది మంది ఆత్మాహుతి బాంబులం అవుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.