Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిత్తూరులో యువతిని బట్టలిప్పి నడిరోడ్డుపై కొట్టిన మహిళలు.. అసలు కారణమిదేనంట...

గురువారం, 18 జనవరి 2018 (21:23 IST)

Widgets Magazine
attack on women

సభ్యసమాజం తలదించుకోవాల్సిన సంఘటన ఇది. తన భర్తతో ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తూ ఒక మహిళ మరో ముగ్గురు మహిళలను వెంటపెట్టుకుని వెళ్ళి గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగలేదు యువతిని వివస్త్రను చేసి నడిరోడ్డుపైనే కొట్టారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
శాంతిపురం మండలం గుంజార్లపల్లికి చెందిన సుబ్రమణ్యం, భాగ్యలక్ష్మిలు భార్యాభర్తలు. సుబ్రమణ్యంకు అదే గ్రామానికి చెందిన ఉమాదేవితో అక్రమ సంబంధం వుందన్న ఆరోపణలున్నాయి. గత కొన్నిరోజులుగా ఉమాదేవితో సుబ్రమణ్యం కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకుండా పోయింది భాగ్యలక్ష్మి. భర్తకు ఎంత నచ్చజెప్పినా పట్టించుకోలేదు. అంతేకాదు ఉమాదేవికి ఆస్తి ఇవ్వడానికి కూడా సిద్థమయ్యాడు సుబ్రమణ్యం. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భాగ్యలక్ష్మి, తన భర్త సుబ్రమణ్యం ఊర్లో లేని సమయంలో ఉమాదేవి ఇంటికి వెళ్ళి ఆమెతో గొడవ పెట్టుకుని రోడ్డుపైకి లాక్కుని వచ్చి బట్టలు విప్పతీసింది. తన వెంట వచ్చిన మరో ముగ్గురు మహిళలు కూడా భాగ్యలక్ష్మికి సహాయం చేశారు. దీనిపై ఉమాదేవి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. తనకు న్యాయం కావాలంటూ పోలీస్టేషన్ ముందు ఉమాదేవి ఆందోళన చేపట్టింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అతడికి లైంగిక పటుత్వం వుందన్న నివేదిక... బెయిల్ మంజూరు

వివాహం రోజే భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ...

news

భార‌త్‌లో ఉన్న‌ట్లుగా లేదు... అమోఘం... అద్భుతం: ఏపిపై పొగడ్తలు

అమరావతి: రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్‌ను దాని ప‌నితీరును చూస్తుంటే తాను భార‌త్‌లో ఉన్న‌ట్లు ...

news

రాజశేఖర్ తప్పుగా మాట్లాడితే చిరంజీవి అలా చేశారు... ఇప్పుడు కూడా(వీడియో)

కత్తి మహేష్- పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదంపై నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి ...

news

యూపీలో వింత .. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప ...

Widgets Magazine