Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అక్రమ సంబంధం... భార్యను ముక్కలు ముక్కలుగా చేసి... ఆ తరువాత?(Video)

మంగళవారం, 6 జూన్ 2017 (16:04 IST)

Widgets Magazine

అక్రమ సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను దారుణంగా చంపేశాడు ఓ భర్త. పోలీసులకు ఆధారాలకు దొరక్కుండా మృతదేహాన్ని ఛిద్రం చేసి తిరుపతిలోని మంగళం సమీపంలో పడేసి వెళ్ళిపోయాడు. సుమారు రెండు సంవత్సరాల పాటు పోలీసులు కేసును ఛేదించి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. 
 
నెల్లూరు జిల్లా కావలిలో చంద్రమౌళి, ఉమాదేవి భార్యాభర్తలు ఉన్నారు. వీరికి రెండు సంవత్సరాల పాప కూడా ఉంది. అయితే పాప తనకు పుట్టలేదని, అక్రమ సంబంధం ద్వారానే పుట్టిందని అనుమానం పెంచుకున్న చంద్రమౌళి భార్యను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 2015 మార్చి 21వ తేదీన ఉమాదేవిని తిరుపతికి తీసుకొచ్చి మంగళం రోడ్డులో చంపి పడేసి వెళ్ళిపోయాడు. మృతురాలి ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు చంద్రమౌళి. 
 
అలాగే చిన్నపాపను కలకత్తా రైలులో వైజాగ్ వరకు తీసుకెళ్ళి వదిలి వచ్చేశాడు. ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో పోలీసులు రెండు సంవత్సరాలుగా కేసును దర్యాప్తు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా కావలిలో ఒక మహిళ మిస్సింగ్ కేసు రావడంతో ఆ కేసును ఆధారంగా చేసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. వెంటనే హత్యకు కారకుడైన నిందితులు చంద్రమౌళితో పాటు అతని స్నేహితులు మాలకొండయ్య, వెంకట రాజేష్‌ కుమార్‌ను తిరుపతిలోని అలిపిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో వదిలేసిన పాప ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అత్తా ఆశీర్వదించు.. రంగంలోకి దిగుతున్నా... దినకరన్, నేను కూడా వచ్చాక చక్రం... శశి

తమిళ రాజకీయాల్లో గత కొన్నిరోజుల ముందు వరకు రజినీకాంత్ వ్యవహారమే హాట్ టాపిక్ ఉంది. అయితే ...

news

దళితుడిని పెళ్లి చేసుకుంది.. అల్లుడితో గర్భవతిగా ఇంటికొచ్చింది.. అంతే సజీవదహనం చేసేసారు..

దేశంలో పరువు హత్యల సంఖ్య పెరుగుతూనే వుంది. ఓ దళితుడిని వివాహం చేసుకుందని.. తద్వారా పరువు ...

news

ముస్లిం దేశాలపై నిషేధం.. కింది కోర్టుల నిర్ణయాలకు ట్రంప్ సవాల్.. సుప్రీం తీర్పు కోసమే వెయిటింగ్..

ఆరు దేశాలకు చెందిన ముస్లిం పౌరులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా విధించి వివాదాస్పద ...

news

కవల పిల్లలను గట్టిగా కౌగిలించుకుని ఊపిరాడనీయకుండా చంపేసిన కసాయి తల్లి

కవల పిల్లలు పుట్టారు. వారు ఆలనాపాలనా చూసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. ...

Widgets Magazine