మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (17:38 IST)

వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

rain
వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తర ఒరిస్సాతో పాటు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపై అల్పపడీన ప్రాంతం ఏర్పడివుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదేసమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెన 18వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. 
 
ఐఎండీ సూచన మేరకు.. జూలై 17 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూలై 18 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జూలై 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
జూలై 16 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలోని మంచిర్యాల జిల్లా కొత్తపల్లెలో 11 సెంటీమీటర్లు, చెన్నూరులో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది.