శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (12:02 IST)

వైజాగ్ వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారుతో మహిళ బీభత్సం

Innova Car Accident
Innova Car Accident
వైజాగ్ వీఐపీ రోడ్డులో మద్యం మత్తులో ఇన్నోవా కారుతో ఓ మహిళ బీభత్సం సృష్టించింది. తప్ప తాగి కళ్లు బయర్లు కమ్మడంతో రోడ్డుపై అతివేగంగా కారు నడిపింది. సోమా పబ్ వద్ద మద్యం మత్తులో సదరు మహిళ అతివేగంగా ఇన్నోవా కారు నడుపుతూ అదుపు తప్పి ఢీకొట్టడంతో ఎనిమిది వాహనాలు ధ్వంసం అయ్యాయి. 
 
వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారు అతివేగంతో వెళుతుండగా అకస్మాత్తుగా అదుపు తప్పి ఆ మార్గంలో ఉన్న పలు వాహనాలను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా  ధ్వంసమైన వాహనాలలో చిక్కుకున్నారు. 
 
వీరిని పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. అధికారులు ప్రస్తుతం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరగ్గానే కారు వదిలి ఆ మహిళ పారిపోయింది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.