మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (20:16 IST)

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా?

exams
ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో మే ఆరో తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో.. పరీక్షలకు రెండు రాష్ట్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారు. 
 
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ 24వ తేదీ వరకు.. తెలంగాణలో 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
ఎప్పటిలాగే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులంతా గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి వుంటుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్లకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాయనున్నారు. 
 
ఏపీ వ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీలో సైతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహిస్తారు.