కర్నూలు కొట్లాట : ఆయనేం సీఎంకాదూ.. ప్రెసిడెంటూ కాదు.. లోకేశ్‌పై టీజీ వ్యంగ్యాస్త్రాలు

బుధవారం, 11 జులై 2018 (16:37 IST)

ఇటీవల కర్నూలులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సీటుకు, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇపుడు కర్నూలు జిల్లా టీడీపీలో చిచ్చురేపింది. నారా లోకేశ్‌పై టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తనదైనశైలిలో స్పందించారు.
tgvenkatesh
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్.. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తనకు ఏమాత్రం అంతుచిక్కడం లేదన్నారు. అయితే, తనకు ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందన్నారు. అభ్యర్థుల ప్రకటనలో ఆయనదే తుది నిర్ణయమన్నారు. 
 
పైగా, అభ్యర్థులను ప్రకటించిన నారా లోకేశ్ పార్టీకి అధ్యక్షుడు కాదు.. ముఖ్యమంత్రికాదని గుర్తుచేశారు. అదేసమయంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి.. మంత్రి లోకేశ్‌ను హిప్నటైజ్ జేసి అలా ప్రకటన చేయించేలా చేసివుంటారని, ఎందుకంటే మా మోహనుడుకి ఆ టాలెంట్ ఉందంటూ వ్యాఖ్యానించారు. 
 
ఏది ఏమైనా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం తుది నిర్ణయం తీసుకున్నాక దానిపై స్పందిస్తానని అన్నారు. ఎప్పుడైనా బీఫామ్ ఇచ్చే ముందు చంద్రబాబు అభ్యర్థి ప్రకటన చేస్తారని, కానీ లోకేష్ ముందుగానే ఎందుకు ప్రకటించారో అర్థం కావడం లేదని తెలిపారు. సర్వేలో అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి తనతో చాలాసార్లు చెప్పారని అన్నారు. 
 
కాగా, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్‌ రెడ్డి, లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టా రేణుక పోటీ నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  
నారా లోకేశ్ టీజీ వెంకటేశ్ ఎంపీ ఎమ్మెల్యే అభక్ష్యర్థులు తెలుగుదేశం పార్టీ Tdp Clash కర్నూలు Kurnool Mp Mla Candidate Tg Venkatesh Nara Lokesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

తాజ్‌మహల్‌ను మీరు ధ్వంసం చేస్తారా? లేదా? : సుప్రీంకోర్టు

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌‌మహల్‌ సంరక్షణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ...

news

పరిపూర్ణానంద నగర బహిష్కరణ.. తప్పుబట్టిన కత్తి మహేష్

శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడాన్ని ...

news

వీడొక మెంటల్‌గాడు.. యాక్సిడెంట్ జరిగితే...

సాధారణంగా రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోయినా.. ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని ...

news

ఇన్‌కంటాక్స్ రద్దు చేస్తే మోదీ వెంట మధ్య తరగతి ప్రజలు వెళ్తారా?

పెద్ద నోట్లు రద్దు చేయడం ద్వారా, నల్లధనాన్ని అరికట్టి, ఒకొక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు ...