శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : గురువారం, 30 జులై 2015 (08:29 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా ఉరి తీశారా...? ఎప్పుడు? ఎక్కడ?

యాకూబ్ మెమన్‌కు ఉరి పడక ముందు తరువాత కూడా ఉరిపై మళ్ళీ మరోమారు చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఎక్కడ చూసినా ఉరిపైనే చర్చ. అసలు ఉరి శిక్ష అమలు చేయాలా? వద్దా? దేశంలో ఎక్కడెక్కడ ఉరి తీసే జైళ్లు ఉన్నాయనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉరి శిక్ష అమలు చేసే జైళ్ళు ఉన్నాయా? ఎక్కడెక్కడ? ఎంతమందిని ఉరి తీశారు.? 
 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉరితీయడానికి అనుకూలమైన జైళ్ళు ఉన్నాయి. రాజమండ్రిలో కేంద్ర కర్మాగారంలో ఆ ఏర్పాట్లు ఉన్నాయి. డచ్‌ వారు అప్పట్లో ఇక్కడ కారాగారాన్ని నిర్మించారు. అప్పట్లో నిర్మించిన రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ చాలా మందిని ఉరి శిక్ష విధించారు. 
 
ఇక్కడ అమలైన ఉరిశిక్షల వివరాలు చూస్తే.. రాజమండ్రిలోని కేంద్ర కారాగారంలోని ఉరికంభం నుంచి మొత్తం 458 మందిని ఉరి తీశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఇక్కడ 47 మంది ఖైదీలను ఉరి తీశారు. 1948లో ఐదుగురుని, 1949లో ముగ్గురిని, 1957లో ఒకరిని, 1959లో 8 మందిని, 1961లో ఇద్దిరిని ఉరితీశారు.

1962లో నలుగురిని, 1963లో ఏడుగురిని, 1964లో ఐదుగరుని, 1967లో ముగ్గురిని, 1968లో ఒకరిని, 1971లో ముగ్గురిని, 1972,74,76లలో ఒక్కొక్కరిని చొప్పున ఉరి తీశారు. చివరిగా ఫిబ్రవరి 1976లో అనంతపురానికి చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీసారు. తరువాత ఇప్పటి వరకూ ఎటువంటి ఉరి అమలు కాలేదు.