వ్యాక్సిన్ ఉందా? లేదా? ఒకసారి చెక్ చేయండి
మీరు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నర్సు ఇంజక్షన్ చేసేటపుడు, ఆ సిరంజిలో వ్యాక్సిన్ నింపి ఉందా? లేదా? అనేది గమనించండి. నిబంధనల ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ 0.5 ఎం.ఎల్. నింపారా లేదా అనేది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే, దురదృష్టవశాత్తు కొన్నిసార్లు... ఇలా ఖాళీ సిరంజులు గుచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు.
కరోనా కష్ట కాలంలో ప్రజల బాధల్ని అర్ధం చేసుకుని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశమంతటా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రికార్డు స్థాయిలో కోవిడ్ వ్యాక్సినేషన్ జరిపిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రజలందరికీ రెండు విడతలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది.
కానీ, మారుమూల గ్రామాల్లో కొన్నిచోట్ల వ్యాక్సిన్ వేసేటపుడు కొందరు గోల్ మాల్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, వ్యాక్సినేషన్ సెంటర్‌కి వెళ్తే, అక్కడ కొంతమంది ఇలా షో చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సరికొత్త సిరంజిలను తీసి, దానిలో తగు పరిమాణంలో వ్యాక్సిన్ నింపి, దానిని లబ్ధిదారుని శరీరంలోకి ఇంజక్ట్ చేయాలి.
కానీ, కొంతమంది నర్సులు నాటకీయంగా ఇలా... కొత్త సిరంజిని తీసి, దానిలో వ్యాక్సిన్ నింపకుండానే, నీడిల్ భుజంలోకి ఇంజక్షన్ చేసి... వ్యాక్సిన్ ఎక్కించేసినట్లు షో చేస్తున్నారు. కొందరి కక్కుర్తి వల్ల అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికే మచ్చ కలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో, తగు పరిమాణంలో వ్యాక్సిన్ ఎక్కించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సెంటర్లలో ఈ విషయంలో ప్రజలు వాదనలకు కూడా దిగుతున్నారు.
నిబంధనల ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కొక్క డోసులోనూ, 0.5 ఎం.ఎల్. వ్యాక్సిన్ ఇంజక్ట్ చేయాలి. ఆ విధంగా వ్యాక్సిన్ సిరంజిల్లో నింపుతున్నారో, లేదో కూడా మెడికల్ అధికారులు గమనిస్తూనే ఉంటారు. కానీ, ఒక్కోసారి వారి కన్నుగప్పి తూతూ మంత్రంగా వ్యాక్సిన్ వేసే సిబ్బంది నుంచి.... మీకు మీరు...తస్మాత్ జాగ్రత్త. అందుకే వ్యాక్సినేషన్ కేంద్రంలో బి అలర్ట్.