Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో... 29న జీఎస్ఎల్వీ-ఎఫ్08

శుక్రవారం, 2 మార్చి 2018 (13:56 IST)

Widgets Magazine
isro

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ ఎఫ్08ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే జీశాట్-6ఏ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ గురువారం ప్రత్యేక వాహంలో తీసుకొచ్చారు.
 
ఈ ప్రయోగానికి సంబంధించి రెండో ప్రయోగ వేదిక రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవేత్తలు పూర్తిచేశారు. 2,140 కిలోల బరువు గల జీశాట్-6ఏ ఉపగ్రహం సమాచార రంగానికి చెందింది. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో ఈ ఉపగ్రహ ప్రయోగం చేపడుతుంది. ఇది విజయవంతమైతే పదేళ్ల పాటు సేవలు అందించనుంది. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే మార్చి 29వ తేదీన జీఎస్ఎల్వీ ఎఫ్08ను నింగిలోకి పంపించనున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శృంగారానికి నిరాకరించిందనీ ప్రియురాలి కుమారుడిని చంపేశాడు...

ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. తనతో కొనసాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధానికి ...

news

మోడీ - షా ద్వయం ఉచ్చులో చంద్రబాబు : జేసీ దివాకర్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉచ్చులో టీడీపీ అధినేత, ఏపీ ...

news

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఎన్‌కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలో భారీఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ హతమయ్యాడు. ...

news

కేసీఆర్.. ఓ దద్దమ్మా : బండారు దత్తాత్రేయ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు ...

Widgets Magazine