భవానీ మాలలకు వేళాయె!
లోక కళ్యాణార్తమై భవానీ మాలలు ధరించే భక్తుల కోసం దేవస్థానము నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అంతేగాక మాల దీక్ష తేదీలను కూడా ప్రకటించారు.
శ్రీ శార్వరీ నామ సంవత్సరం భవానీ మండల దీక్షా కార్యక్రమ నిర్వహణ వివరములు :
1. మాలాధారణ (మండల దీక్షలు): ది: 25-11-2020 ఉ.08 గం.లకు ప్రారంభమై ది: 30-11-2020 వరకు ( శ్రీ శార్వరీ నామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పౌర్ణమి వరకు)
2. అర్ధమండల దీక్షలు: ది.15-12-2020 నుండి ది: 19-12-2020 (మార్గశిర శుద్ధ విదియ నుండి మార్గశిర శుద్ధ షష్టి వరకు)
3. కలశ జ్యోతి ఉత్సవము: మార్గశిర పౌర్ణమి ది.29-12-2020 సా.06 గం.ల నుండి సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి ప్రారంభమగును.
4. మాలా విరమణ మహోత్సవం: ది.05-01-2021 నుండి ది.09-01-2021 వరకు(ది. 05-01-2021 ఉదయం గం.06.50 నిం.లకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభం).
5. పూర్ణాహుతి : ది.09-01-2021 ఉ.గం.11 లకు మహా పూర్ణాహుతి.