1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (11:56 IST)

e-auto లను ప్రారంభించిన సీఎం జగన్ - ఒక్కో ఆటో ధర రూ.4.10 లక్షలు

jagan flag
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ-ఆటోలను ప్రారంభించారు. చెత్త సేకరణకు పర్యావరణ రహితంగా ఉండేలా 516 విద్యుత్ ఆటోలను సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేశారు. ఒక్కో ఆటో విలువ 4.10 లక్షల రూపాయలు కాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని తయారు చేశారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ.21.18 కోట్లను ఖర్చు చేసింది. 
 
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లో 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్థాల సేకరణకు నిలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్-1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2525 పెట్రోల్, డీజల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తుంది. అలాగే, గుంటూరు, విశాఖపట్టణంలలో వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను ప్రారంభించింది.