మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (22:22 IST)

ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన జగన్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటిస్తున్నారు. వంగాయగూడెంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 
 
వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రోగులతో ముఖ్యమంత్రి జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే విప్లవం తీసుకొచ్చిందని జగన్ అభిప్రాయపడ్డారు.

ఇంకా మిన్నగా మరో అడుగు ముందుకు వేయడానికే ఇక్కడికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని... ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు.

ఇక నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల 59 వైద్యసేవలుంటాయని... ఇంతకుముందు 1,059 వైద్యసేవలు ఉండేవన్నారు. ఫిబ్రవరి 1 నుంచి క్యాన్సర్‌ రోగి రూపాయి... ఖర్చుపెట్టక్కర్లేదని సీఎం వెల్లడించారు. క్యాన్సర్‌ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

ఆరోగ్యశ్రీకి ప్రత్యేక కార్డులు ఇస్తున్నామని... కోటి 42 లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ఇవాళ్టి నుంచే ఇస్తామన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించని ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని తెలిపారు.