మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

నియంతలా జగన్: నారా లోకేశ్

నిజాయితీ ఉంటే కేసులు పెట్టడం కాదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ సూచించారు.

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వపాలనను ఎండగట్టిన ఆయన.. పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన నియంతలా సీఎం జగన్ మారారని విమర్శించారు. చేతగాని పాలన అని క్యాబినెట్ సాక్షిగా ఒప్పుకున్నారన్నారు. కానీ అదే విషయాన్ని రాసిన జర్నలిస్టులని చంపేస్తున్నారు.

పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను మట్టుపెడుతున్నారన్నారు. మరి తమ తుగ్లక్ పాలన గురించి మాట్లాడుకుంటున్న ప్రజలపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. పిచ్చి ముదిరి ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.