శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (20:14 IST)

అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోంది.. నాడు ద్రౌపదికి.. నేడు రోజమ్మకు : జగన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. నాడు పాండవుల సమక్షంలో ద్రౌపదికి అవమానం జరిగితే.. ఇపుడు రోజమ్మకు అదే పరిస్థితి ఎదురైందన్నారు. ఏది ఏమైనా అన్ని పైనవున్న దేవుడు చూస్తున్నాడన్నారు.
 
ద్రౌపదికి అన్యాయం చేసిన కౌరవులు నాశనం అయిపోయారని, వీరికి కూడా అదే గతి పడుతుందని శాపనార్థాలు పెట్టారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోరంట్లతో క్షమాపణ చెప్పించలేకపోయారని మండిపడ్డారు. 
 
టీడీపీ నేతల బుర్రలు చెడిపోయాయని, వారు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేవుడు ఏదో ఒక రోజు వారికి మొట్టికాయలు వేయడం ఖాయమని అన్నారు. ఆ తర్వాత సీఆర్డీఏ బిల్లుపై చర్చకు తాము సమ్మతం తెలపడంతో ఆ బిల్లును రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి నారాయణ ప్రవేశపెట్టారు.