Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడ ఎన్నికలే నాంది కావాలి: జగన్

ఆదివారం, 27 ఆగస్టు 2017 (16:33 IST)

Widgets Magazine
ys jagan

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాకినాడలో విమర్శలు గుప్పించారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు అమలు చేయని వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా?  పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్‌ ధ్వజమెత్తారు.
 
 జాబుల విషయంలోనూ ఇంతే జరిగిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని తెలిపారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్‌ఆర్‌ ఫీజు రియంబర్స్‌‌ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్‌ జగన్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జార్ఖండ్‌‌లోని జండెష్‌పూర్‌లో ఘోరం: 52మంది చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ సరఫరా లోపాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృతి ...

news

నైజీరియాలో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. 27 మంది పౌరుల హతమార్చారు..

నైజీరియాలో ముస్లిం తీవ్రవాద సంస్థ బొక హరామ్ విరుచుపడింది. గ్రామాలపై తీవ్రవాద సంస్థ ...

news

భర్తతో కాపురం చేయనంది.. ప్రియుడితోనే ఉంటానంది.. అంతే ఆ భర్త?

భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని భరించలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి ...

news

బస్సులో టాప్, జీన్స్ చించేశారు.. నోటికి టేప్ అతికించారు.. వీడియో వైరల్

మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా మొరాకోలోని కాసాంబ్లాంకా పట్టణంలో ...

Widgets Magazine