శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (08:05 IST)

"తుగ్లక్ గారూ..." జగన్ పై విరుచుకు పడిన లోకేష్

టీడీపీ యువనేత లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తుగ్లక్ అంటూ వ్యంగంగా సంబోధించారు. ఇంకా ఆయన ట్విట్టర్ లో ఏమన్నారంటే...
 
"తుగ్లక్ గారు ఉన్నారా?విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం,మీ తుగ్లక్ చర్య వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గారు లోక్ సభ లో చెప్పారు
 
పోలవరం ప్రాజెక్టు లో 2600 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ తల తిక్క లెక్కలు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తుంది.  పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది.
 
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ, సిడబ్ల్యుసి, కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించిన తర్వాతే నాబార్డ్ నిధులు విడుదల చేస్తుంది. ఇన్ని కేంద్రవ్యవస్థలకు కనిపించని అవినీతి మీకు కనిపించింది. రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరానికి టెండర్ పెట్టడమని అర్థమయింది" అని లోకేష్ మండిపడ్డారు.