'జగనన్న చేదోడు' ప్రారంభం..లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10,000 జమ  
                                       
                  
				  				  
				   
                  				  జగనన్న చేదోడు పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు.
				  											
																													
									  అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.247.04 కోట్లు జమ చేయనున్నామన్నారు. 'జగనన్న చేదోడు' ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు.
				  మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. అర్హతలు ఎన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోందని చెప్పారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  ఈ పధకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందుతుంది. ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేస్తున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్ అకౌంట్లకు ఈ నగదు జమ చేస్తున్నారు. 
				  																		
											
									  
	 
	షాపులున్న 1,25,926 మంది టైలర్లకు రూ. 125,92,60.000, 82,347 మంది రజకులకు రూ. 82,34,70.000, 38,767 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 38,76,70.000 మొత్తం 2,47,040 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.
				  																	
									  ఈ లబ్దిదారులు వారి వృత్తికి అవసరమగు చేతి పనిముట్లు, చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడమే ఈ పధకం ప్రధాన ఉద్దేశం.