ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (10:55 IST)

వారి మెదడు ఇంతేనేమో అని జాలిపడాల్సిందే... జనసేన

ఏపీ సర్కారు పాలనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చీల్చి చెండాడుతున్నారు. వీటికి సమాధానం చెప్పలేదని వైకాపా నేతలు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒక్కడంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా వాటికి సరైన సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వారి మెదడు ఇంతేనేమో అని జాలిపడాల్సిందే" అని వ్యాఖ్యానించింది. ఇటువంటి వైసీపీ నాయకులను చూసి కోప్పడవద్దని, వారి మెదడు ఇంతేనా అని జాలి పడాలని చెబుతూ, ఓ కార్టూన్ కూడా పోస్ట్ చేసింది.