గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 అక్టోబరు 2024 (12:02 IST)

జనసేన సభ్యత్వం వుంటే చాలు, ఉచిత వైద్యం: BEST సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

Best Hospital
సార్ పవన్ కల్యాణ్ గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది, జనసేన కార్యకర్త ఒకరికి వైద్యం చేయాలని, ఆ ఫోన్ కాల్ రాగానే నాకు ఓ ఆలోచన వచ్చింది. నా వంతు సాయంగా మా ఆసుపత్రిలో ఉచిత వైద్యం చేయాలని, జనసేన సభ్యత్వం వుంటే చాలు, మా ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాము అంటున్నారు బెస్ట్ సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం.
 
జనసేన కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించి ఇతర పార్టీలకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ ముందడుగు వేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎలాంటి సమస్యలు రాకుండా సంతోషంగా వుండాలన్నది ఆయన అభిలాష. ఇందుకుగాను మావంతు సాయంగా ఆసుపత్రిలో ఉచితవైద్యం చేయాలనుకుంటున్నామని BEST superspeciality hospital వారు చెప్పారు.