శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:36 IST)

2 నుంచి జనసేన ఉత్తరాంధ్ర సమావేశాలు

జనసేన పార్టీ ఉత్తరాంధ్ర సంస్థాగత సమావేశాలు మార్చి రెండో తేదీ నుంచి మూడు రోజులపాటు విశాఖపట్నంలో జరగనున్నాయి.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశాల్లో పాల్గొని పార్టీకి సంబంధించిన వివిధ అంశాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పార్టీ నేతలతో చర్చిస్తారు.

ఇప్పటి వరకు ప్రకటించిన కమిటీలలోని సభ్యులు, పార్టీ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇంచార్జిలు, జిల్లాలోని ముఖ్యనాయకులు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
 
మార్చి 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా, మార్చి 3వ తేదీ ఉదయం 11 నుంచి 1 గంట వరకు విజయనగరం జిల్లా, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విశాఖ రూరల్ జిల్లా సమావేశాలు జరుగుతాయి.

మార్చి 4 ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం, 11 గంటల నుంచి 12 .30 వరకు విశాఖ అర్బన్ జిల్లా సమావేశం, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఉత్తరాంధ్ర సంయుక్త పార్లమెంట్ కమిటీ సమావేశాలు జరుగుతాయి.