Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీరు సూపర్ అక్కా.. జనసేన మహిళా కార్యకర్త సుభాషిణి కౌంటర్ (వీడియో వైరల్)

బుధవారం, 1 నవంబరు 2017 (17:04 IST)

Widgets Magazine

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు కష్టాలు మీద కష్టాలొస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా భూమా అఖిలప్రియ డ్రెస్ కోడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న రోజాకు వైకాపా చీఫ్ జగన్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. జగన్ ఇచ్చిన వార్నింగ్‌తో రోజా కాస్త నోటికి కళ్లెం వేశారు.

అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తలా తోకా లేవని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ మహిళా కార్యకర్త సుభాషిణి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సుభాషిణి అనే మహిళా కార్యకర్త, రోజాను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
రోజా తనకు సోదరి వంటిదని సుభాషిణి తెలిపారు. రోజా అన్ పార్లమెంటరీ భాషను వాడుతున్నారని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాను తలాతోకా లేని పార్టీలో చేరబోనని జనసేనను ఉద్దేశించి రోజా చెప్పడాన్ని గుర్తు చేస్తూ, "మీరు సూపర్ అక్కా. మీరు కరెక్ట్ గానే మాట్లాడారు.

ఈ విషయంలో మీరు సూపర్. మీరు తలా తోక ఉన్న పార్టీల్లోనే ఉండండి. మాకు తలలే ఉన్నాయి. తోకలు లేవు" అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ వీడియోలో రోజాకు సుభాషిణి ఎలా కౌంటరిచ్చిందో చూడొచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మ్యాన్‌హాట్టన్‌ దాడికి పాల్పడిన ఉగ్రవాదిని ఎలా కాల్చారంటే.. (వీడియో)

న్యూయార్క్‌లో ట్రక్కుతో దాడికి పాల్పడిన వ్యక్తిని సైఫుల్లో సైపోవ్‌గా గుర్తించారు. ...

news

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. సచివాలయం కట్టితీరుతాం : కేసీఆర్

ప్రస్తుత సచివాలయం అడ్డదిడ్డంగా ఉండటంతో ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బందిగా ఉందని, అందువల్ల ...

news

ఆడు మగాడ్రా బుజ్జీ...కమల్, రజినీలపై గుర్రుగా ఉన్న అభిమానులు..

జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి ...

news

నాది ఉడుం పట్టుతో సమానం.. రాహుల్ మార్షల్ ఆర్ట్స్ కుస్తీలు

నిత్యం రాజకీయాలే అనే వారికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ఆట విడుపు చర్యలతో ఔరా ...

Widgets Magazine