శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మే 2020 (11:04 IST)

ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడిచే మూత్రం తాగించారు..

ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రేమిస్తే కేసులు పెట్టడం లేదంటే నచ్చజెప్పడమో చేయాలి కానీ.. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఓ దళిత యువకుడు ప్రేమించాడని చెప్పి అతడిచే మూత్రం తాగించారు. దీనిపై ఎస్సి, ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. కేసును సుమోటో గా స్వీకరించి విచారణ జరపాలని అదికారులను ఆదేశించింది.
 
జన్నారం మండలానికి చెందిన అన్వేష్ అనే మైనర్ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో యువకుడు అడవిలోకి వెళ్లగా స్నేహితులతో విషయం తెలుసుకున్న యువతీ బంధువులు కర్రలతో దాడిచేసి మూత్రం తాగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.