1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (15:23 IST)

అమ్మ జయలలిత రిలీజ్: దీపావళి ఈరోజే.. అమ్మరాకతోనే వర్షాలు!

అక్రమాస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయడంతో తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీం కోర్టు బెయిల్ పత్రాలు పరప్పన కోర్టుకు అందడంతో.. శనివారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. ప్రత్యేక విమానం ద్వారా తమిళనాడుకు చేరుకునే అమ్మకు స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. 
 
ఇకపోతే,.. తమిళనాడు మాజీ సీఎం జయలలితకు బెయిల్ రావడం, ఆమె శనివారం జైలు నుంచి విడుదల కావడం శుభప్రదమని, ఆమె రాకతోనే తమిళనాట ఇప్పటి వరకు కురవని వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయని ఆమె వీరాభిమానులు అంటున్నారు. 
 
శనివారం పరప్పన అగ్రహార జైలు నుంచి రిలీజ్ అయిన జయలలిత రాక కోసం అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు వేయి కనులతో ఎదురుచూశారు. అమ్మకోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 
 
అన్నాడీఎంకే వ్యవస్థాపక రోజైన శుక్రవారమే ఆమెకు బెయిల్ లభించిందని, శనివారం ఆమె విడుదలయ్యే రోజే మాకందరికీ దీపావళి అని అమ్మ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే.. జయ విడుదల కానుండటంతో పరప్పన జైలు ప్రాంగణంలో అన్నాడీఎంకే కార్యకర్తలు పండగ చేసుకున్నారు. కార్యకర్తల సందడితో జైలు ప్రాంగణం కళకళలాడింది.