శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (17:27 IST)

మన కట్టుబాట్లు స్త్రీలను పురుషుడికి బానిసగా మార్చాయి: జయసుధ

విజయవాడలో జరుగుతున్న పార్లమెంటీరియన్‌ సదస్సులో సినీ నటి జయసుధ మాట్లాడుతూ.. లింగ వివక్ష దూరమైనప్పుడే అసలైన సాధికారిత సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 12శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం

విజయవాడలో జరుగుతున్న పార్లమెంటీరియన్‌ సదస్సులో సినీ నటి జయసుధ మాట్లాడుతూ.. లింగ వివక్ష దూరమైనప్పుడే అసలైన సాధికారిత సాధ్యమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా 12శాతం మంది మహిళలే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండటం శోచనీయమన్నారు. భారత్ కంటే సౌదీలాంటి దేశాల్లోనే మహిళల ప్రాతినిధ్యం ఎక్కువ ఉందన్నారు. 
 
సమాన హక్కులు అనేవి కోటాలు, రిజర్వేషన్ల వల్ల రావని, రాజ్యాంగం కల్పించిన హక్కుని మనమే తీసుకోవాలని జయసుధ సూచించారు. మన సంప్రదాయాలు, కట్టుబాట్లు పురుషుడికి స్త్రీని బానిసగా మార్చాయని నటి జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో ఉన్న మహిళల పట్ల భర్తల జోక్యం విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.