శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (13:05 IST)

మొత్తం మీరే చేశారు.. మీ వల్లే నష్టం జరిగింది.. జేసీపై యనమల ఫైర్

ఏపీ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా, అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు టీడీపీ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తారసపడ్డారు. అపుడు పరస్పరం అభివాదం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా యనమలతో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికేనా రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ ప్రశ్నించారు. దీనికి యనమల ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. 
 
"మొత్తం మీరే చేశారు. మీ వల్లే నష్టం జరిగింది" అని ఒకింత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. వీరిద్దరి సంభాషణను దగ్గరుండి చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు, వీరి వైఖరిపై కొత్త చర్చకు తెరలేపారు. 
 
ఇదిలావుండగా, గత రెండు రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పి వైకాపా లేదా బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో యనమల తాజాగా చేసిన వ్యాఖ్యలతో జేసీ దివాకర్ రెడ్డి నొచ్చుకున్నట్టు సమాచారం.