శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (14:20 IST)

విశాఖ ఉక్క కర్మాగారంపై జిందాల్ కన్ను

విశాఖపట్టణం ఉక్కు ఫ్యాక్టరీపై జిందాల్ స్టీల్ ప్లాంట్ కన్నేసింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఉక్కు కర్మాగారాన్ని దక్కించుకునేందుకు జిందాల్ గ్రూపు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 
 
విశాఖ ఉక్కుతోపాటు ఎన్ఎండీసీకి చెందిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్ కొనుగోలుపైనా జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఆసక్తి కనపరుస్తుంది. నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్స్ ఇపుడు వీటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.