శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (17:57 IST)

ఇఆర్‌సి చైర్మన్ గా జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్‌పర్సన్‌ గా రిటైర్డ్ హైకోర్ట్‌ న్యాయమూర్తి జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ ఈ మేరకు జస్టీస్‌ సీవీ నాగార్జునరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం నూతన ఇఆర్‌సి చైర్మన్‌ జస్టీస్‌ సీవీ నాగార్జున రెడ్డికి రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిలు పుష్ఫగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు న్యాయమూర్తులు, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, కృష్ణదాసు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనీల్‌ కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండి నాగుపల్లి శ్రీకాంత్‌, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.