మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (19:38 IST)

21న అనంతపురం జిల్లాకు జస్టిస్ రమణ.. ఎందుకో తెలుసా?

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ భగవాన్ సత్యసాయి వేడుకలలో పాల్గొనడానికి అనంతపురం జిల్లాకు రానున్నారు. 21న ఈ నెల సతీసమేతంగా జిల్లాకు వస్తున్నారు.

జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 21వ తేదీన బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి  పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు.

అనంతరం పుట్టపర్తికి చేరుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 22న సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ  స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రయం నుంచి  బెంగళూరుకు తిరిగి బయలుదేరి వెళతారు.