కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకాకు చుక్కెదురు.. టీడీపీ రవి రికార్డు విజయం

సోమవారం, 20 మార్చి 2017 (11:00 IST)

ys jagan - ys viveka

కడప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డికి చుక్కెదురైంది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బీటెక్  రవి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తొలి రౌండ్ నుండి ఉత్కంఠను కొనసాగించాయి. తొలి రౌండ్‌లో టిడిపి అభ్యర్థి బీటెక్ రవిపై వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
 
రెండో రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్థి నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అయితే మూడో రౌండ్ ముగిసే సరికి టిడిపి అభ్యర్థి బీటెక్ రవి తన సమీప వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
 
34 ఏళ్ళ తర్వాత కడప జిల్లాలో వైఎస్ కుటుంబసభ్యులను ఓడించి టిడిపి అభ్యర్థి రవి చరిత్ర సృష్టించారు. వైకాపాకు కంచుకోటగా నిలిచిన కడపలో విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేసిన టీడీపీ కృషి ఫలించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో వైసిపిపై ఆధిపత్యాన్ని సాధించింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అందరినీ సమానంగా చూస్తా.. వర్గ వివక్ష చూపబోను... యోగి.. ఎందుకు వెక్కివెక్కి ఏడ్చారు?

హిందూ అతివాదిగా పేరొందిన యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా తన ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. ...

news

ఈ తెల్లవాళ్లకు ఏం పోయేకాలమొచ్చిందో.. మతబోధకులపైనా దాడులే..

అమెరికానే కాదు.. పాశ్చాత్య ప్రపంచం మొత్తంగా జాతి విద్వేష జ్వాలలో తగులబడుతున్నట్లుగా ...

news

ఆయనే ఓ వివాదాల పుట్ట... కానీ ఇకపై వద్దంటున్నారు.. ఆహా రాజకీయమా..!

గత రెండేళ్లకుపైగా ఈ యోగి కమ్ రాజకీయనేత చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో అందరికీ ...

news

జయ మృతిపై అనుమానాలు.. మారథాన్ నిర్వహించ తలపెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల విచారణ జరపాలని డిమాండ్ చేసిన పాపానికి తేని జిల్లా ...