గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (16:12 IST)

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మరోమారు అగ్నిప్రమాదం

fire accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 
 
ఈ ఘటన మరువకముందే సోమవారం మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.