శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (08:58 IST)

కనకదుర్గ ఫ్లైఓవర్‌ సొగసు చూడతరమా?

స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో  దేశంలోనే ఢిల్లీ, ముంబయిల తర్వాత మూడవది... పొడవులో దేశంలోనే మొదటి వంతెన.. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేయనున్నారు.

తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసు నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌గా పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిలతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్లై ఓవర్‌ వద్ద వాహనాల రాకపోకలను ప్రారంభిస్తారు.

బెంజ్‌సర్కిల్‌-1 ఫ్లైఓవర్‌ ని కూడా...
బెంజ్‌సర్కిల్‌-1 ఫ్లైఓవర్‌ ని కూడా కేంద్ర మంత్రి గడ్కరీ శుక్రవారం ప్రారంభించనున్నారు. బెంజ్‌ ఫ్లై ఓవర్‌-1ను రూ.75 కోట్ల వ్యయంతో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ చేపట్టింది. ఎస్వీఎస్‌ జంక్షన్‌ నుంచి నోవాటెల్‌ వరకు 1.14 కిలోమీటర్ల పొడవున్న ఈ మూడు వరసల వంతెనను కేంద్రం తలపెట్టింది. వాస్తవానికి దీనిని కూడా ఆరు వరసలతో నిర్మించాల్సి ఉంది.