Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విద్యార్థినిపై అత్యాచార యత్నం... సన్నివేశాలు సోషల్ మీడియాలో పోస్ట్(వీడియో)

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (20:33 IST)

Widgets Magazine
Rape attempt

కామాంధుల దుశ్చర్యలు రోజురోజుకీ పెచ్చుమీరిపోతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నం చేసి ఆ సన్నివేశాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టుతో యువతిపై వారు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... కనిగిరిలోని ఓ ప్రైవేటు కాలేజీలో సదరు యువతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో కార్తీక్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. దానికి ఆమె తిరస్కరించింది. దీనిపై ఆగ్రహం చెందిన కార్తీక్ తన స్నేహితులు అనీల్, సాయిలను తీసుకుని యువతిని మంచిగా మాట్లాడుతూనే ఈ విషయంపై మాట్లాడదాం అంటూ కనిగిరి శివారు ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లారు. అక్కడ మళ్లీ కార్తీక్ తనను ప్రేమించాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. అంతే... ముగ్గురూ కలిసి ఆమెపై అత్యాచార యత్నం చేశారు. 
 
ముగ్గురినీ ఎంత బ్రతిమాలాడినా రాక్షసుల్లా ఆమెపై అఘాయిత్యం చేయబోయారు. పైగా ఆ సన్నివేశాలను వీడియో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయాన్ని తల్లిదండ్రుల వద్ద చెప్పేందుకు యువతి భయపడింది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. టవీ9 వీడియో... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జర్నలిస్టులందరికీ ఇళ్లు... మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ...

news

వైఫ్ స్వాపింగ్‌కు ప్రపోజ్ చేసిన ఫ్రెండ్.. ఆ తర్వాత...

భార్యలను మార్చుకుందామంటూ పదేపదే ఒత్తిడి తెచ్చిన స్నేహితుడిని మరో ఫ్రెండ్ కడతేర్చాడు. ఈ ...

news

డేరా బాబా ధ్యానంలో ఉన్నాడంటే... అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు...

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో 20 యేళ్ళ జైలుశిక్షను అనుభవిస్తున్న డేరా చీఫ్ ...

news

డ్రగ్స్ మాఫియా నన్ను చంపేస్తుందేమో? కోర్టుకు 'డేరా' హనీ

ఒకవైపు డేరా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసులకు ...

Widgets Magazine