గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (08:34 IST)

భార్యపై అనుమానం... ముక్కలుగా నరికి నదిలో పడేసిన భర్త!

కట్టుకున్న భార్య తనను మోసం చేసి పరాయి వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇది మరింతగా పెరిగిపోవడంతో భార్యను కడతేర్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మూటలు గట్టి నదిలోపడేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా దేశవళ్లి అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశవళ్లి గ్రామానికి చెందినకి ఆశా (28), రంగప్ప అనే దంపతులు ఉన్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే అనుమానం రంగప్పలో బాగా నాటుకునిపోయింది. 
 
దీంతో నాలుగు నెలల క్రితం బావ చంద్రతో కట్టుకున్న భార్య రంగప్ప నరికి చంపాడు. కొడవలితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హేమావతి నదిలో పడేశారు. 
 
అయితే వీరిపై అనుమానించిన ఆశా తండ్రి గౌరి శంకర్‌ పాండవపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో కృష్ణరాజపేట పోలీసులు గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం ఇచ్చారు. 
 
గౌరి శంకర్‌ మృతదేహాన్ని చూసి తన కుమార్తెగా గుర్తించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త రంగప్పను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చేసిన తప్పును అంగీకరించారు. దీంతో రంగప్ప, చంద్రలను పోలీసులు అరెస్టు చేశారు.